కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు కేంద్రం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. నిషేధాజ్ఞలతో రోజుకూలీలు, కార్మికులు కుదేలయ్యారు. ఉన్న ఊళ్లో పనుల్లేక.. సొంత ఊరు వెళ్లలేక ఇబ్బందులెదుర్కొంటున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. యాజమాన్యాలు కూడా చేసేదేమీ లేక కార్మికులను పనిలో నుంచి తీసివేస్తుండడంతో కనీసం ఆహారం దొరక్క అలమటించిపోతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకన స్వగ్రామాలకు పయనమవుతున్నారు. అలా ఉన్నపళంగా ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో ఎనిమిది నెలల గర్భిణి భర్తతో కలసి వంద కిలోమీటర్లు నడిచిన విషాద సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసిందిషహ్రాన్‌పూర్‌లోని ఒక కంపెనీలో పనిచేసే వకీల్, తన భార్య యాస్మీన్‌తో కలసి స్వగ్రామానికి పయనమయ్యాడు. కంపెనీ మూతపడి వాళ్లిచ్చిన గది కూడా ఖాళీ చేయమనడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కాలినడకన 200 కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూరికి బయల్దేరాడు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన యాస్మీన్ కూడా కాలినడకన పయనమైంది. లాక్‌డౌన్ కారణంగా రోడ్డుపై ఎలాంటి హోటల్స్ లేకపోవడంతో రెండు రోజులుగా భోజనం చేయకుండా నడుస్తూనే ఉన్నారు.
ఎనిమిది నెలల గర్భిణి 100 కి.మీ కాలినడక.. రెండురోజులుగా తిండి లేదు.. చివరికి.